Thursday, December 5, 2024

గోల్డెన్ టెంపుల్ లో కాల్పుల కలకలం.. అకాలీదళ్ నేతపై ఫైరింగ్(వీడియో)

- Advertisement -
- Advertisement -

పంజాబ్‌ లోని స్వర్ణదేవాలయం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. బుధవారం ఉదయం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. వెంటనే చుట్టుప్రకక్కల వారు కాల్పులు జరిపిన వ్యక్తిని అడ్డుకుని పట్టుకున్నారు. దీంతో సుఖ్ బీర్ సింగ్ ప్రాణయాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతను సురక్షితంగా ఉన్నాడు. ఇక, నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎస్‌ఎడి స్పందిస్తూ.. భద్రత కల్పించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది.

కాగా, ఈ ఘటనపై ఏడీసీపీ హర్పాల్ సింగ్ స్పందిస్తూ.. సరైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని, ఉదయం 7:00 గంటల నుంచి తాను స్వయంగా సైట్‌లోనే ఉన్నానని చెప్పారు. దాడి చేసిన వ్యక్తిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించామని తెలిపారు. చౌరా నిన్న కూడా గుడిలో ఉన్నాడని… బుధవారం ఉదయం, అతను ఎప్పటిలాగే ఆలయానికి వచ్చి బాదల్ పై కాల్పులు జరిపే ముందు పూజలు కూడా చేసాడని తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, నిందితుడు డేరాబాబా నివాసి అని, దాల్ ఖల్సా సభ్యుడు అని, 2013లో UAPA కింద అరెస్టయ్యాడని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News