Thursday, December 5, 2024

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం ఒక కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక, మంగళవారం శ్రీవారిని 60,301 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. 20,222 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.3.32 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

కాగా, తిరుచానూరు పద్మావతి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది. కాంతులీనుతున్న స్వర్ణ రథంపై ప‌ద్మావ‌తి అమ్మ‌వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News