Thursday, December 5, 2024

రోశయ్య వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్‌: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై సిఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రోశయ్య సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిందని సిఎం కొనియాడారు. బుధవారం హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నిర్వహించిన రోశయ్య మూడో వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణకు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ లభించిందని చెప్పారు. రోశయ్య తన ఛాంబర్‌కు పిలిపించుకుని తనకు విలువైన సూచనలు చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్షం తప్పక ప్రశ్నించాలని.. పాలకపక్షం పరిష్కరించాలని చెప్పారని.. ప్రజలకు మేలు కలిగేలా పాలకపక్షాన్ని నిలదీయాలని చెప్పారని సీఎం రేవంత్‌ అన్నారు.ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News