Thursday, December 12, 2024

హరీశ్‌రావును అరెస్టు చేయొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి, బిఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను అరెస్టు చేయవద్దని పంజాగుట్ట పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తన ఫోన్ ట్యాప్ చేయించి.. తనతపోటు తన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు చేస్తూ సిద్ధిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్.. హరీశ్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్ రావుపై పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

దీనిపై స్పందించిన హరీశ్ రావు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు తనపై అక్రమలు పెడుతున్నారని.. ఈ క్రమంలో పంజాగుట్టలో నమోదు కేసును కొట్టివేయాలని..తనన అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని నిన్న(బుధవారం) హైకోర్టులో పిటిషన్ వేశారు. గురువారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ కేేసులో హరీశ్ రావును అరెస్టు చేయొద్దని ఆదేశించింది. హరీశ్‌రావుపై ఫిర్యాదు చేసిన చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చన్న ఉన్నత న్యాయస్థానం.. దర్యాప్తునకు హరీశ్‌రావు సహకరించాలన్న పేర్కొంంది. తదుపరి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News