- Advertisement -
తిరువనంతపురం: వాయ్ నాడ్ జిల్లా లో కొండచరియలు విరిగిపడి బాధితులైన వారి పునరావాసం కోసం ‘ఫెడరల్ ఎయిడ్’ నిరాకరించినందుకుగాను వందలాది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్ డిఎఫ్) కార్యకర్తలు కేరళవ్యాప్యంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వైపు మార్చ్ చేశారు. రాజ్ భవన్ ను ముట్టడించారు.
తిరువనంతపురంలోని రాజ్ భవన్ వద్ద రాష్ట్రవ్యాప్త ఆందోళనను ప్రారంభించిన సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ ప్రసంగిస్తూ బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఏ ప్రభుత్వం ఇప్పటికీ నిర్వాసితులైన 2000 కుటుంబాలకు ఎలాంటి సాయం అందించలేదన్నారు. ప్రకృతి విపత్తు నుంచి బయటపడిన వారిని జనజీవనస్రవంతిలోకి తేడానికి వారికి సరైన సాయం అందించాలన్నారు.
- Advertisement -