Thursday, December 12, 2024

పెళ్లికి నో… యువతి తల్లి, సోదరుడిని చంపిన యువకుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: యువతిని ఇచ్చి పెళ్లి చేయలేదని ఆమె తల్లి, సోదరుడిని దారుణంగా పొడిచి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిప్పాణి ప్రాంతంలోని అక్కోళ గ్రామంలో యువతి వెంటనే ప్రేమిస్తున్నానని రవి అనే యువకుడు వేధించాడు. యువకుడి ప్రేమను పలుమార్లు యువతి తిరస్కరించింది. ఆమె ఇంటికెళ్లి కూతురిని పెళ్లి చేసుకుంటానిన చెప్పడంతో వారు షాక్ గురయ్యారు. తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తేలేదని యువతి కుటుంబ సభ్యులు చెప్పారు. కోపంతో రగిలిపోయిన రవి కత్తి తీసుకొని యువతి తల్లి మంగళనాయక(42), సోదరుడు ప్రజ్వల నాయకపై దాడి చేశాడు. ఇద్దరిని కడుపులో పలుమార్లు పొడవడంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News