Thursday, December 12, 2024

మళ్లీ వెండితెర పైకి ఆ జంట

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ కలిసి వెండితెరపై కనిపించనున్నారు. ‘గీతగోవిందం’ చిత్రంతో విజయ్ దేవరకొండ, రష్మిక జంట బ్లాక్‌బస్టర్ జోడీగా నిలిచింది. ఈ జంటకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. దీని తర్వాత వారు ‘డియర్ కామ్రేడ్’ కోసం మళ్లీ కలిశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ జంట క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ కలిసి నటించబోతున్నారు.

వీళ్ల కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్ తో సినిమా చేయబోతున్నాడు. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాపులరైన రాహుల్ ఈసారి విజయ్‌ను మరో కొత్త పాత్రలో చూపించబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి కాంబినేషన్ కోసం కాకుండా, కథ బాగుంటేనే తామిద్దరం కలిసి నటిస్తామని గతంలోనే విజయ్ దేవరకొండ ప్రకటించాడు. కాబట్టి రాహుల్ సినిమాలో రష్మికకు పవర్‌ఫుల్ రోల్ దక్కినట్టే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News