Thursday, December 12, 2024

సినిమాకు హైలైట్‌గా ఆ డైలాగ్..

- Advertisement -
- Advertisement -

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రలు చాలా స్పెషల్‌గా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన సన్నివేశంలో చెప్పే డైలాగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట.

ఆ లెంగ్తీ డైలాగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని కూడా వారు అంటున్నారు. సినిమాలో వచ్చే ప్రతి డైలా గ్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఇక ఆ డైలాగ్ ఎన్నో సం వత్సరాలు గుర్తుంచుకునే విధంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రముఖ మాటల రచయిత సాయి మా ధవ్ బుర్ర ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు.

రామ్‌చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సిని మా తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన విష యం తెలిసిందే. అందుకే గేమ్ ఛేంజర్ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఏకంగా యూఎస్‌లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న గేమ్ ఛేం జర్ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News