హైదరాబాద్: క్రికెట్ పరి భాషలో ఎదుర్కొన తొలి బంతికే పరుగులేమీ చేయకుండా ఔట్ అయితే గోల్డెన్ డకౌట్ అంటారు. పరుగులేమీ చేయకుండా రెండో బంతికి ఔట్ అయితే సిల్వర్ డక్, మూడో బంతికి ఔట్ అయితే బ్రాంజ్ డకౌట్ అంటారు. ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా రనౌట్ రూపంలో ఔట్ అయితే డైమండ్ డకౌంట్ అంటారు. ఇండియా -ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో యశస్వి జైస్వాల్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ కావడంతో గోల్డెన్ డకౌట్ తెరపైకి వచ్చింది.
శ్రీలంక స్పిన్ బౌలర్ మురళీధరన్ 14 సార్లు గోల్డెన్ డకౌట్ రూపంలో రికార్డు సృష్టించారు. లషిత్ మలింగా(13), దినేష్ కార్తీక్(17), రోహిత్ శర్మ(16) సార్లు డకౌట్ రూపంలో మైదానం వీడారు. శ్రీలంక బౌలర్ ముత్తయి మురళీధరన్ 59 సార్లు డకౌట్ రూపంలో ఔటై తొలి స్థానంలో ఉండగా వాల్ష్ కూడా 54 సార్లు డకౌట్ అయి రెండో స్థానంలో ఉన్నారు. భారత్ నుంచి బౌలర్ జహీర్ ఖాన్(44), ఇషాంత్ శర్మ(40), విరాట్ కోహ్లీ(38), హర్భజన్ సింగ్(37), అనిల్ కుంబ్లే(35), రోహిత్ శర్మ(34), సచిన్ టెండూల్కర్(34) సార్లు డకౌట్ రూపంలో వెనుదిరిగారు.