అడిలైడ్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ తొలి రోజు టీమిండియా 23 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 82 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీసి టీమిండియా నడ్డివిరిచాడు. 82 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ రూపంలో మైదానం వీడాడు. రెండో వికెట్‌పై రాహుల్, గిల్ 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెఎల్ రాహుల్ 37 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మెక్ స్వీనయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ ఏడు పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ 31 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(4), రోహిత్ శర్మ(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
Once again king kohli nicked to slip. India 82-4 at lunch. Pant and rohit sharma are playing. #INDvsAUS #pant. #kohli #RohitSharma𓃵 #gill #KLRahul #jaiswal pic.twitter.com/yCs5EYxaAA
— Darshan soni 💙 (@Darshansoni97) December 6, 2024