లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో 11 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్‌కు చెందిన 11 మంది పెళ్లికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పిలిభిత్ జిల్లాలోని నియోరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ కుటుంబంలో ఒకరు చనిపోవడంతో అస్థికలు గంగా నదిలో కలుపడానికి 11 మందితో కారులో వెళ్లారు. అస్థికలు గంగా నదిలో నిమజ్జనం చేసి వస్తుండగా చిత్రకోట్ జిల్లా రాయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి స్థానికులు తరలించారు. రెండు ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పొగమంచుతోనే ఈ ప్రమాదాలు జరిగినట్టు సమాచారం.
వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో 11 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -