Tuesday, December 17, 2024

చెప్పిందే చేస్తున్నాం..పిట్టకథలు బిఆర్‌ఎస్ నేతలకే సొంతం:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్షమని, అందుకోసమే అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుండి ఏడాదిలోపు అనేక సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారెంటీల అమలు, రైతుల బాధలు,పేదల సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శుక్రవారం నల్లగొండ జిల్లా, బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టును పరిశీలించి మంత్రి పొన్నం సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కల ఉదయసముద్రం ప్రాజెక్టు అని, నాటి నుండి నేటివరకు అవిశ్రాంతంగా 17 ఏళ్లపాటు ఈ ప్రాజెక్టు కోసం నిత్యం కృషి చేసిన మహనీయుడ, ఆయన కృషే నల్లగొండ జిల్లా రైతులకు రేపటి నుండి సాగునీరు అందించబోతోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ప్రతిపక్షం చేస్తున్నట్టుగా పిట్టకథలు, మాయమాటలు బిఆర్‌ఎస్ నాయకులకే సొంతం అని, అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను పిట్టకథలు, మాయమాటలు చెప్పి పదేళ్లు పరిపాలన సాగించారని, అయినప్పటికీ లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.

మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలన,ప్రజలకు సంక్షేమ పాలన అందించకుండా కెసిఆర్ కుటుంబం బాగుపడిందని, అధికారం కోల్పోవడంతో ఆ కుటుంబంలోని సభ్యులంతా ఉద్యోగాలు పోయాయన్నంత దిగాలుతో రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలకు మాయమాటలు చెబుతూ మోసాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి మాటలను ప్రజలు నమ్మబోరని, నిజం తెలుసుకాబట్టే సంక్షేమ పాలన అందించే కాంగ్రెస్‌కు అసెంబీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పట్టం కట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజునుండే ఆరు గ్యారెంటీల పథకాల్లో ఒకటైన ఆర్టీసి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటుకు ఇలా ఒక్కొక్కటిగా పథకాలను అమలు పరుస్తూ ప్రజలకు చేరువవుతన్నామని అన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజల గుండెల్లో నిలుచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలకు చేరవేయాలన్న అసత్యపు ఆలోచనతో బిఆర్‌ఎస్ ఉద్యమాలు నిర్వహిస్తోందని విమర్శించారు. మంత్రుల వెంట నకిరేకల్ ఎంఎల్‌ఎ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్‌పితోపాటు ఇంజనీరింగ్, రెవెన్యూ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, శనివారం బ్రాహ్మణవెల్లెంలలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండాపకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News