Saturday, January 18, 2025

ఇడ్లీలో జెర్రి.. కంగుతిన్న వినియోగదారుడు

- Advertisement -
- Advertisement -

ఇడ్లీలో జెర్రి దర్శనమివ్వడంతో వినియోగదారుడు ఒక్కసారిగా కంగుతిన్నారు. రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర ఉడిపి హోటల్‌లో టిఫిన్ చేసేందుకు శుక్రవారం వచ్చిన ఒక వ్యక్తి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. వెయిటర్ తీసుకువచ్చిన తరువాత తినేందుకు మొదలుపెట్టాడు. అంతలోనే ఇడ్లీలో జెర్రి కనిపించడంతో అక్కసారిగా ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, తక్షణమే బంద్ చేయాలని డిమాండ్ చేశాడు. తక్షణమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్, అధికారులు తనిఖీలు చేయడంతోపాటు రాఘవేంద్ర హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇదిలావుండగా, ఇడ్లీలో జెర్రి వచ్చిన విషయమై హోటల్ మేనేజర్ యుగేందర్ మాట్లాడుతూ..తమ హోటల్‌లో ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఎన్నడూ జరగలేదని అన్నారు.పరిశ్రుభతకు అధిక ప్రాధాన్యం ఇస్తాయపి. ఇది ఎలా జరిగిందో తమకు తెలియదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News