Thursday, December 12, 2024

గారడీ గ్యారంటీలు, గాయబైన హామీలు:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

గారడీ గ్యారంటీలను, గాయబైన హామీలను, గాడితప్పిన పాలనను తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. నీడను కూలుస్తూ, నీచ రాజకీయాలు చేస్తూ, నియంత పాలన కొనసాగిస్తున్న నీతిలేని నాయకులను,

నిజాం వారసుల దోస్తులను తెలంగాణ సమాజం నిలదీస్తుందంటూ కాంగ్రెస్ పాలకులపై ట్వీట్‌లో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆరు బద్ధాలు, 66 మోసాల పేరుతో బిజెపి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 7న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News