Thursday, December 12, 2024

మంత్రి కొండా సురేఖను బర్తఫ్ చేయాలని బిజెపి నాయకుల డిమాండ్!

- Advertisement -
- Advertisement -

వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించే రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ శనివారం బిజెపి నాయకులు ఈఓ ఛాంబర్ ముందు భైఠాయించి నిరసన ప్రదర్శించారు. కోడెలు పక్కదారి పట్టించడంలో కీలక పాత్ర పోషించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని, కోడెలను తనకిష్టమొచ్చినట్లు పంచిపెట్టిన ఈఓ వినోద్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ బైఠాయింపులో బిజెపి పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, నామాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News