Thursday, December 12, 2024

విజయోత్సవ సంబురాలు షురూ..

- Advertisement -
- Advertisement -

నక్లెస్ రోడ్‌లో ఘనంగా ప్రారంభమైన విజయోత్సవ వేడుకలు
ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్
పాల్గొన్న మంత్రి పొన్నం, సీఎస్, మేయర్, వేం, హర్కర
పసందైన తెలంగాణా, ఆంధ్ర, మొగులాయి వంటకాలు
సందర్శకులను ఆకట్టుకున్న ఫుడ్ స్టాల్స్
విద్యుత్ దీపాలంకరణతో దగదగా మెరిసిన పీవీ మార్గ్, సచివాలయం
ఎయిర్ షోకు భారీ ఏర్పాట్లు : సిఎస్ శాంతి కుమారి
హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్, జీఏడీ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.

పలు పసందైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో మెరుస్తాన్నాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన పలు బ్రాండెడ్ హోటల్స్ ఈ ఫుడ్ స్టాళ్ళ కౌంటర్స్ ఏర్పాటు చేశాయి. హైదరాబాదీ బిర్యాని, మొగులాయి వంటకాలు, చాట్, ఐస్ క్రీం, నార్తన్ తదితర వెరైటీ ఫుడ్ స్టాళ్ళ ఏర్పాటు. హైదరాబాద్, మొగులాయి, తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరి ఐటమ్స్ ఐస్ క్రిమ్ పార్లర్లను విజయోత్సవాల్లో పాల్గోనే సందర్శకుల సౌకర్యార్థం వందకు పైగా ఫుడ్ స్టాళ్లను అందుబాటులొకి తెచ్చారు. అంతర్జాతీయంగా పేరోందిన హైద్రాబాదీ దమ్ బిర్యాని తోపాటు మొగలాయి, జఫ్రాని బిర్యాని పర్యాటకులకు అందించేందుకు ప్రముఖ హోటళ్ళయిన ప్యారెడైజ్, పిస్తా హౌజ్, షాదాబ్, బడేమియా కబాబ్ తదితర హోటళ్లు తమ బ్రాండ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.

వీటితోపాటు తెలంగాణ వంటకాలుగా పేరొందిన పాలమూరు గ్రీల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటు కోడి చికెను, పుడ్ జాయింట్స్ ను అందుబాటులోకి తెచ్చారు. నిలోఫర్ కెఫ్, బ్రౌన్ బేర్ బేకరిలు ప్రాంకిల్ మ్యాగి హాట్స్పాట్ కాంటినెంటల్ కాఫీ, ప్రాంకి అండ్ రోల్స్, మొమోస్ అండ్ ప్రైస్ తో పాటు గోకుల్ చాట్ కూడ తమ సంస్థ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేసారు. వీటి,తో పాటు ఆగ్రా చాట్ అండ్ స్వీట్స్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందిరా మహిళ శక్తి క్యాంటిన్లను కూడ ఏర్పాటు చేశారు.

ఎయిర్ షోకు భారీ ఏర్పాట్లు : సిఎస్ శాంతి కుమారి
మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించచే ప్రజా పాలన విజయోత్సవాల ఏర్పాట్లను సిఎస్ శాంతి కుమారి శనివారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. విజయోత్సవాలలో భాగంగా ఆదివారం నాడు నిర్వహించే ఎయిర్ షో కు భారీ సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున, వారికి ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం వైమానిక ప్రదర్శన, 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశానికి జిఎడి కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హరీష్, అడిషనల్ సిపి విక్రంజీత్ మాన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, విద్యా శాఖ డైరెక్టర్ వెంకట నర్సింహా రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, భారతీయ వైమానిక దళం ఏర్పాటు చేస్తున్న ఎయిర్ షోలో తొమ్మిది సూర్యకిరణ్ విమానాలు పాల్గొంటాయని తెలిపారు.

ఈ రకమైన విన్యాసం చేయగల సత్తా ప్రపంచంలో కేవలం 5 టీమ్ లకు మాత్రమే ఉందని, అందులో ఒక టీమ్ హైదరాబాద్ లో చేయుట మన రాష్ట్రానికే గర్వ కారణం అని సిఎస్ పేర్కొన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, వివిఐపిలు, వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు ఈ ఎయిర్ షో వీక్షించడానికి హాజరవుతున్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎయిర్ షో లో సూర్యకిరణ్ కు చెందిన తొమ్మిది విమానాలు పాల్గొంటాయని తెలిపారు. ఈ షోతోపాటు సాయంత్రం నిర్వహించే మ్యూజికల్ కాన్సర్ట్ కు నక్లెస్ రోడ్, పివి మార్గ్ లలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, వీరి సౌకర్యార్థం ఇప్పటికే ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎయిర్ షో అనంతరం రాహుల్ సింప్లి గంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నందున, తగు మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని పేర్కొన్నారు.

ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజు 9న సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని సిఎస్ శాంతి కుమారి తెలిపారు. సచివాలయ ఆవరణలో జరిపే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది పాల్గొంటారని, ఇందుకు తగు ఏర్పాట్లు చేయాలని సిఎస్ సూచించారు. ఆవిష్కరణ సందర్బంగా దాదాపు 150 మంది ప్రముఖులు ఆసీనులయ్యేలా ప్రధాన వేదిక తోపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదిక ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులకు, నగర ప్రముఖులకు ఆహ్వానాలను సకాలంలో పంపాలని సూచించారు.

ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్, వారికి కనీస సౌకర్యాల ఏర్పాటు, తదితర అంశాలపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జిహెచ్‌ఎంసి కమీషనర్ ఇలంబర్తి, సిడిఎంఎ శ్రీదేవి, హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. 9వ తేదీన తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యే స్వయం సహాయ బృందాలు మహిళలు, ఇతరులందరూ మధ్యాహ్నం నాలుగున్నర లోగా సభా ప్రాంగణానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. నెక్లస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్ లలో పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశామని నగర పోలీస్ అడిషనల్ కమీషనర్ విక్రంజీత్ సింగ్ మాన్ తెలిపారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరయ్యే మహిళలను ఎక్కువ దూరం నడవకుండా వేదిక సమీపంలో వాహనాలను అనుమతించి, అనంతరం పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలని సిఎస్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News