Monday, January 6, 2025

తెలంగాణ తల్లి ఆవిష్కరణ సభకు రాలేను: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి రాలేక పోతున్నానని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు తనను ఆహ్వానించినందుకు ఆయన పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రిగా తన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు పార్లమెంటులో సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నందున అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News