ఈత కోసం వచ్చి అనంతలోకాలకు
జలాల్‌పూర్ చెరువుకట్టపై ఘటన
మన తెలంగాణ/భూదాన్‌పోచంపల్లి: కారు అదుపు తప్పి చెరువుల్లోకి దూసుకె ళ్లి ఐదుగురు యువకులు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని జలాల్‌పూర్ గ్రామంలో శనివారం విషా దం నింపింది. స్థానికులు, పోలీసుల వివరాలు ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఆర్టీసి కాలనీకి చెందిన తీగల వంశీ (24), కలకోటి అక్షయ్‌కుమార్ (22), జెల్ల వినయ్ (21), ఇంద్రపల్లి హర్ష (22), వీరమల్ల విఘ్నేష్ (21)లు శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుంచి బయలుదేరి మద్యం సేవించి తెల్లవారుజా మున కల్లు తాగేందుకు పోచంపల్లికి వచ్చారు. అయితే భోజనం చేసేందుకు వె తకగా భోజనం దొరకకపోవడంతో మళ్లీ రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంకు వెళ్ళా రు. పోచంపల్లికి తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యలోని జలాల్‌పూర్ గ్రామం సమీపంలోని చెరువు కట్టపై అతివేగంగా రావడంతో కారు అదుపుతప్పి చెరువు లోకి దూసుకెళ్లింది.
ఈ క్రమంలో మెడబోయిన మణికంఠ అనే యువకుడు కారు అద్దాన్ని ధ్వంసం చేసి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మిగతా ఐదుగురికి ఈత రాకపోవడంతో శ్వాస ఆడక మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలిని చౌటుప్పల్ ఎసిపి మధుసూదన్ రెడ్డి, సిఐ రాములు, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, ఆరై గుత్త వెంకట్‌రెడ్డి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.