Saturday, December 21, 2024

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు…బిఆర్ఎస్ కేడర్ సిద్ధం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీసేందుకు సిద్ధమవుతోంది.  అందుకు ప్రాణాళిక కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కెసిఆర్ భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ నిర్వహించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఎలా నడుచుకోవాలో బిఆర్ఎస్ ఎంఎల్ఏ లకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీని ఢీకొని, తగు రీతిలో ప్రశ్నలు లేవనెత్తాలని సూచించారు. ఇదిలావుంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలకైనా కెసిఆర్ వెళతారా లేదా అన్నది ఇప్పటికీ తెలియలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News