Thursday, December 12, 2024

చార్జిషీట్ కాదు..రిప్రజెంటేషన్‌గా భావిస్తున్నాం : పొన్నం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రతిపక్ష బిఆర్‌ఎస్, బిజెపి ఇచ్చింది చార్జిషీట్ కాదని, వాటిని రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని – మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బిజెపి ,బిఆర్‌ఎస్ వేరు కాదని, వాళ్ళిచ్చిన్న ప్రజెంటేషన్ చార్జిషీట్స్ మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కానీ దురదృష్టకరం ఎంటంటే సంవత్సర కాలం పరిపాలన తరువాత ఇవాళ మమ్మల్ని విమర్శించిన చార్జిషీట్ ఫైల్ చేసి ఉంటే బాగుంటుండేదని, కాని ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే చార్జిషీట్ అని ఇస్తే ఇది భవ్యం కాదని పొన్నం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎలా నడుస్తుందన్నారు, పిల్లి శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. వారిచ్చిన చార్జిషీట్ అంశాలు ప్రజా సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామినిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News