- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా, సమావేశాల్లో పలు బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పింఛన్ చెల్లింపు, అనర్హతల తొలగింపు(సవరణ) ఆర్డినెన్సు, తెలంగాణ పురపాలక సంఘాల(సవరణ) ఆర్డినెన్సు, హైదరాబాదు మహానగర పాలక సంస్థ(సవరణ) ఆర్డినెన్సు, తెలంగాణ వస్తువుల, సేవల పన్ను(సవరణ) ఆర్డినెన్సు, తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్స్‌లను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక, అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ వార్షిక నివేదికలను సంబంధితశాఖల మంత్రులు సభలో ప్రవేశపెడుతారు.
- Advertisement -