- Advertisement -
హైదరాబాద్: ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంఎల్ఏ జగ్గారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కెసిఆర్ కోట్ల కొద్దీ రూపాయలు అప్పు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ …ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దశలవారీగా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వారి దొంగ మాటలను ప్రజలు నమ్మొద్దని అన్నారు.
- Advertisement -