Thursday, December 12, 2024

బాక్సాఫీసును కుమ్మేస్తున్న ‘పుష్ప-2’ హిందీ వర్షన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పుష్ప-2 హిందీ ప్రాంతంలో దుమ్ము రేపేస్తోంది. ఒక్కరోజులోనే రూ. 86 కోట్లు సంపాదించిన తొలి హిందీ డబ్బింగ్ చిత్రంగా చరిత్ర సృష్టిస్తోంది. నాలుగో రోజున బాక్సాఫీసు వద్ద రూ. 291 కోట్లు దాటేసింది. హిందీలో బ్లాక్బస్టర్ గా చెప్పుకుంటున్న జవాన్(రూ. 180.45 కోట్లు), యానిమల్ (రూ.176.58 కోట్లు), పఠాన్ (రూ. 161 కోట్లు)ను కూడా పుష్ప-2 అధిగమించేసింది. హిందీలో మూడు రోజుల్లోనే రూ. 205 కోట్లు ఆర్జించింది. ఈ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదని పివిఆర్ ఐనాక్స్ రెవెన్యూ ఆపరేషన్స్ సిఈవో గౌతం దత్త తెలిపారు.

పుష్ప-2 ఒరిజినల్ గా తెలుగు సినిమానే అయినప్పటికీ తమిళ్, కన్నడ, మలయాళం,బెంగాలీ, హిందీ బాషల్లో కూడా వెలువడింది. బాక్సాఫీసు  వద్ద సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12000 కు పైగా స్క్రీన్స్ లో విడుదలైన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టిస్తోంది. నటుడు అల్లు అర్జున్, నటి రష్మిక మందన్న, దర్శకుడు సుకుమార్ కాంబినేషనలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 10 నుంచి 15 రికార్డులను బ్రేక్ చేసిందని ప్రొడ్యూసర్, ట్రేడ్ నిపుణుడు గిరీశ్ జోహార్ తెలిపారు.  విశేషమేమిటంటే హిందీ వర్షన్ పుష్ప-2 యే 60 శాతం రెవెన్యూను తెచ్చిపెట్టింది. హిందీ బెల్టులో 90 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. హిందీలో సునామీ సృష్టిస్తున్న తెలుగు సినిమా పుష్ప-2 అనే చెప్పాలి. తొలి వారంలోనే హిందీలో రూ. 500 కోట్లను రాబట్టేసింది. హిందీలో రూ. 700 కోట్లు రాబట్టేలా ఉంది! ఇప్పటికీ మంచి ఆదరణతో దూసుకుపోతోంది. పుష్ప-2 ఎగ్జిబీటర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతూ హుషారెక్కిస్తోంది.

పుష్ప-2 పచ్చి  మాస్ మసాలా సినిమా. ఫైటింగ్ లు, పాటలు, ఫ్యామిలీ డ్రామా, గగుర్పొడిచే సీన్లు, అన్నిటికి మించి  అల్లు అర్జున తన సూపర్ నటనతో చించేశాడనే చెప్పాలి. అందుకే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దండీగా సొమ్ము చేసుకుంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News