Thursday, December 12, 2024

ప్రతి రంగంలో ఆర్‌పిటి మంత్రంతో అభివృద్ధి:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రతి రంగంలో ‘సంస్కరణ, ప్రదర్శన, పరివర్తన’ (ఆర్‌పిటి) మంత్రంతో అభివృద్ధి కానవస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వెల్లడించారు. జైపూర్‌లో ‘రైజింగ్ రాజస్థాన్ సమ్మిట్’ తొలి సెషన్‌లో మోడీ ప్రసంగిస్తూ, ప్రపంచంలోని ప్రతి నిపుణుడు, మదుపరి భారత్ గురించి ఎంతో ఉత్సుకత చెందుతున్నారని చెప్పారు. ‘గదచిన పది సంవత్సరాల్లో భారత్ పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమించింది. గడచిన పది సంవత్సరాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని దాదాపు రెండింతలు చేసింది. భారత ఎగుమతులు కూడా పది సంవత్సరాల్లో దాదాపు రెట్టింపు అయ్యాయి’ అని ఆయన తెలియజేశారు. భారత్‌లో భారీ ఉత్పత్తి స్థావరం ఉండడం ముఖ్యమని మోడీ ఉద్ఘాటించారు. ‘ప్రస్తుతం ప్రపంచానికి బృహత్ సంక్షోభంలో సైతం దృఢంగా పని చేస్తుండే ఆర్థిక వ్యవస్థ అవసరం ఉంది. దానికి అంతరాయం కలగరాదు. ఇందు కోసం భారత్‌లో పెద్ద ‘ఉత్పత్తి స్థావరం’ ఉండడం అత్యంత ప్రధానం’ అని ఆయన సూచించారు.

భారత్ వంటి భిన్నత్వ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుండడం గొప్ప విజయం అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉంటూనే మానవాళి సంక్షేమం భారత్ సిద్ధాంతానికి మూల కారణం, భారత ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కు ద్వారా దేశంలో సుస్థిర ప్రభుత్వం కోసం వోటు వేస్తున్నారు. యువ శక్తి దీనిని ముందుకు తీసుకువెళుతోంది’ అని ఆయన చెప్పారు. రానున్న అనేక సంవత్సరాల పాటు ప్రపంచంలో పిన్న వయస్కుల దేశాల్లో భారత్ ఒకటిగా ఉండబోతున్నదని ప్రధాని తెలిపారు. ‘భారత్‌లో అతి పెద్ద యువజనుల విభాగం, అతిపెద్ద నిపుణులైన యువజనుల విభాగం ఉన్నాయి. ఇందు నిమిత్తం ప్రభుత్వం ఒకదాని తరువాత ఒకటిగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నది’ అని మోడీ తెలియజేశారు. డిజిటల్ టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ ఏ విధంగా ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూరుస్తున్నదో భారత్ చూపిందని ప్రధాని చెప్పారు. ‘భారత్ అసలైన ‘ప్రజాస్వామ్యం, జనాభా, డేటా’ శక్తిని ప్రపంచానికి చూపుతోంది’ అని ఆయన తెలిపారు. అభివృద్ధి, వారసత్వ సంపద మంత్రంపై తమ ప్రభుత్వం పని చేస్తున్నదని, రాజస్థాన్ దాని నుంచి భారీగా లబ్ధి పొందుతున్నదని ప్రధాని మోడీ చెప్పారు.

స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాల ప్రాథమ్యం దేశ అభివృద్ధి గాని, వారసత్వ సంపద గాని కాదని, ఆ కారణంగా రాజస్థాన్ నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. ‘రాజస్థాన్ కేవలం ఉత్థానం చెందడమే కాకుండా విశ్వసనీయంగా కూడా రుజువు చేసుకుంటున్నది. రాష్ట్రం మార్పునకు స్పందిస్తోంది, కాలక్రమేణా తనను తాను సరిదిద్దుకోవాలో కూడా రాష్ట్రానికి తెలుసు’ అని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఆయన బృందం స్వల్ప వ్యవధిలోనే అద్భుత ఫలితాలు సాధించారని, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన నిబద్ధత ఎంతైనా ప్రశంసనీయమని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News