- Advertisement -
వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో వికలాంగులు మహా ధర్నా నిర్వహించనున్నారు. ఇందిరా పార్క్ వద్ద జరుగనున్న వికలాంగుల మహాదర్నకు టిఆర్‌ఎస్, సిపిఎం సిపిఐ, టిజెఎస్, టిడిపి పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత 20 రోజుల నుండి రాష్ట్రంలో వికలాంగులు ఉద్యమం చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మహాదర్నాను జయప్రదం చేయాలని ఆయన వికలాంగులకు పిలుపునిచ్చారు.
- Advertisement -