ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికా అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. శ్రీలంకపై 20తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా డబ్లూటిసిలో అనూహ్యంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైన టీమిండియా అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. భారత్‌పై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా రెండో స్థానాన్ని దక్కించుకుంది. శ్రీలంకపై సౌతాఫ్రికా విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఒక స్థానాన్ని కోల్పోక తప్పలేదు. లంకపై జయకేతనం ఎగుర వేసిన దక్షిణాఫ్రికా మొదటి స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం సౌతాఫ్రికా (66.33 శాతం)తో టాప్‌లో కొనసాగుతోంది. డబ్లూటిసిలో సౌతాఫ్రికా మొదటి స్థానాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. కొంతకాలంగా దక్షిణాఫ్రికా టెస్టుల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా 60.71 శాతంతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. భారత్‌పై రెండో టెస్టులో గెలిచిన కంగరూలు డబ్లూటిసిలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
కానీ లంకపై విజయంతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సౌతాఫ్రికా టాప్‌లోకి అడుగుపెట్టింది. ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియా మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. ఈ సిరీస్‌లో భారత్ తొలి టెస్టులో గెలిచి డబ్లూటిసిలో టాప్కు చేరుకుంది. కానీ అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డేనైట్ టెస్టులో ఓటమితో టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. చివరి ఐదు మ్యాచుల్లో భారత్ ఏకంగా నాలుగింటిలో పరాజయం పాలైంది. దీంతో డబ్లూటిసిలో ఫైనల్ బెర్త్‌ను క్లిష్టంగా మార్చుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్గవాస్కర్ సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టు మ్యాచుల్లో గెలిస్తేనే భారత్‌కు ఫైనల్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒక్క మ్యాచ్‌లో ఓడిన తుది పోరుకు చేరుకోవడం కష్టంగా మారుతుంది. మరోవైపు ప్రస్తుతం డబ్లూటిసిలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక, ఇంగ్లండ్ టీమ్‌లు టాప్5లో నిలిచాయి. కాగా డబ్లూటిసి సైకిల్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి టాప్2లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.