విగ్రహం నచ్చలేదని
రాజకీయాలు చేయొద్దు
ప్రతి డిసెంబర్ 9న
అవతరణోత్సవాలు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన వచ్చిన డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను జరుపుతామని సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ స మావేశాల్లో భాగంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగా ణ తల్లి ఆకాంక్షలను గత ప్రభుత్వం నెరవేర్చలేకపోయింద ని ఆయన ఆరోపించారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. అందుకే ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతోన్న సమయం లో ఉద్యమ స్ఫూర్తితో తమ వాహనాలపై అందరూ రాసుకు న్న టిజి పదాలనే తాము అధికారికంగా ప్రకటించి ఆచరణలోకి తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. గత పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణకు రాష్ట్రీయ గీతమే లేదన్నారు. అందుకే కవి అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ గీ తాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించామని ఆయన తెలిపారు. 2009, డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రకటనను సోనియాగాంధీ ప్రకటించారన్నారు. సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చాని ఆయన పేర్కొన్నారు.
మాతృమూర్తిని చూసినట్టే ఉండాలి
దేవత ఇంట్లో ఉంటుందని కానీ, తల్లి ఒడిలో పెరుగుతామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తల్లిని చూస్తే మాతృమూర్తిని చూసినట్టే ఉండాలని ఆ విగ్రహానికి అలానే తుది రూపు తీసుకొచ్చామన్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది కి తెలంగాణ తల్లి అవిష్కరణ నచ్చలేదని ఆ విషయంలో రా జకీయాలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని ఈ ఉత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. విగ్రహం ఏర్పాటుకు అన్ని పార్టీల సభ్యులు హాజరు కావాలని స్పీకర్ ద్వారా సిఎం కోరారు.
అధికారిక గుర్తింపునిస్తున్నాం
కోటి రతనాల వీణ నా తెలంగాణ అని… కవి దాశరధి అన్న ది ముమ్మాటికీ సత్యమేనని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర పంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వేనని ఆయ న తెలిపారు. ఆ అస్తిత్వానికి మూలం మన సంస్కృతేనని, అందుకు ప్రతిరూపం తెలంగాణ తల్లి అని ఆయన అన్నా రు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో సకల జనులను ఐక్యం చేసింది ఆ ప్రతిరూపమేనని ఆయన తెలిపారు. తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది తెలంగాణ తల్లి అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాల కు అధికారిక గుర్తింపు లేదని తెలంగాణ తల్లి అంటే భావన కాదు భావోద్వేగమని సిఎం అన్నారు. సచివాలయం సాక్షి గా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకుంటున్నామని సిఎం రేవంత్ అన్నారు. తెలంగాణ తల్లికి అధికారిక గుర్తిం పు ఇస్తున్నామని అసెంబ్లీలో సిఎం రేవంత్ తెలిపారు.
భావోద్వేగానికి లోనైన ముఖ్యమంత్రి
నిరంతరం సబ్బండవర్గాలను చైతన్యపరిచి లక్ష్య సాధన వై పు నడిపిన స్ఫూర్తి తెలంగాణ తల్లిదేనని ఆయన తెలిపారు. తెలంగాణ తల్లి రూపంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని నిండైన రూపాన్ని తీర్చిదిద్ది సచివాలయంలో ఆవిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. మెడకు కం టె, గుండపూసల హారం, చెవులకు బుట్ట కమ్మలు, ముక్కుపుడక, బంగారు అంచుతో కూడిన చీరతో చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలమ్మ తెలంగాణ తల్లి రూపం ఉంద ని సిఎం పేర్కొన్నారు. కుడి చేతితో జాతికి అభయమిస్తూ ఎ డమ చేతిలో తెలంగాణలో పండే పంటలతో తల్లి దర్శనమిస్తుందని ఆయన తెలిపారు.
ఉద్యమాలు, ఆత్మ బలిదానాల కు సంకేతంగా పీఠంలో పిడికిళ్లను పొందుపరిచామని, తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణమని ఆయ న అన్నారు. చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునః నిర్మాణాన్ని తెలుపుతున్నాయని,తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయం, సంస్కృతులను పరిగణలోకి తీసుకున్నామని సిఎం తెలిపారు. ప్రశాంత వదనంతో సం ప్రదాయ కట్టుబొట్టుతో గుండుపూసలు, హారం, ముక్కుపుడకతో, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి రూపకల్పన చేశామని సిఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.