మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: ప్రభుత్వాలు మారితే ప్రజల తలరాతలు మా రాలి.. తల్లులు మారొద్దు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అ న్నారు. పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం ఘనం గా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మాజీ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌సిలు తదితరులతో కలిసి ఆయన కుత్బుల్లాపూ ర్ చేరుకున్నారు. నూతన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ జిలా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, సెక్రటేరియట్లో ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని అన్నారు.
ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అంత గొప్పగా ఉండడానికి వీలులేదని అన్నారో.. తెలుగు తల్లి గొప్పగా ఉన్నా ప ర్వాలేదు.. కానీ తెలంగాణ తల్లి గొప్పగా ఉందొద్దు అని కుట్రపన్నారని అన్నా రు. తెలంగాణ దివాలా తీసినట్టు కనపడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలాకోరు పాలకులు వాళ్ళ దారిద్య్రానికి ప్రత్యేకంగా తల్లి రూపాన్ని మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో తల్లి విగ్రహాన్ని మార్చిన మూర్ఖులు ప్రపంచం లో ఎక్కడా లేరన్నారు. ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలని తప్ప తల్లులు మారడం తప్పు తప్పు అని అన్నారు. దేవతారూపంలో ఉన్న తెలంగా ణ తల్లిని చిన్నగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. చేతులెత్తి మొక్కే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చి అవమానించిన వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా
రుణమాఫీ మొత్తం తిప్పి తిప్పికొడితే 18 కోట్ల 98 లక్షలు అని అన్నారు. రేవం త్ రెడ్డి ఏమో అయిపోయింది.. అయిపోయింది.. మొత్తం అయిపోయింద అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు అటకెక్కినై..ఏం జరిగిందో ఈ ఏడాదిలోనే ఆలోచిస్తే మూడు మాటలు చెప్పచ్చునని అన్నారు. కెసిఆర్‌కు తిట్లు, దేవుని మీద ఒట్లు, 420 హామీలకు మాత్రం తూట్లు అన్నారు. ఇదిలావుండగా, తొలుత మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలతో కలిసి వచ్చిన కెటిఆర్‌కు పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎంఎల్‌ఎ వివేకానంద్, మేడ్చల్ జిల్లా ఎంఎల్‌ఎలు ఘన స్వాగతం పలికారు.