Monday, December 23, 2024

మనోజ్ నుంచి నాకు ప్రాణహాని

- Advertisement -
- Advertisement -

పోలీసులకు తండ్రి మోహన్‌బాబు ఫిర్యాదు
n రచ్చకెక్కిన కుటుంబ విభేదాలు n మోహన్ బాబు ఇంటి వద్ద భారీగా మోహరించిన బౌన్సర్లు
n గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మనోజ్‌కుమార్ ఫిర్యాదు

మనతెలంగాణ/ సిటిబ్యూరో: సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ గొడవ కొనసాగుతోంది. ఆస్తుల పంపకాల విషయంలో తేడాలు రావడంతో మోహన్ బాబు తన అనుచరులతో కలిసి చిన్న కుమారుడు మనోజ్‌కుమార్‌పై దాడి చేయించిన విషయం తెలిసిందే. కుమారుడు మనోజ్‌కుమార్, అతడి భార్య మౌనికా రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని సినీనటుడు మోహన్‌బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిపికి ఉత్తరం రాశారు, మనోజ్‌కుమార్ మనుషులు దౌర్జన్యంగా ప్రవేశించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. తన ఇంట్లో ఉన్న మనోజ్‌కుమార్‌ను, మౌనికను పంపించాలని కోరారు. త న ఇంటిని, మాదాపూర్‌లోని కార్యాలయాన్ని బలవంతంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద 40మంది బౌన్సర్లను ఏ ర్పాటు చేశారు, దీనికి పోటీగా మనోజ్‌కుమార్ 30 మంది బౌన్సర్లను పంపించాడు. అయితే అక్కడికి వెళ్లిన మనోజ్‌కుమార్ బౌన్సర్లను ఇంటిలోపలికి వెళ్లనీయకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే మంచు విష్ణు విదేశాల నుంచి వస్తున్నట్లు ప్రచారం జరగడంతో గొడవ జరుగుతుందని అందరూ భావించారు. మోహన్‌బాబుకు మద్దతు గా లేడీ బౌన్సర్లను రప్పించుకున్నట్లు తెలిసింది. ఆ స్తుల పంపకం విషయంలో ముఖ్యంగా వారు నడుపుతున్న శ్రీవిద్యానికేతన్‌కు సంబంధించి మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరిగి, మో హన్ బాబు అనుచరుడు, శ్రీవిద్యానికేతన్‌కి చెందిన వినయ్ అనే అతను తన అనుచరులతో కలిసి మనోజ్‌పై దాడి చేశాడని మనోజే మీడియాకు చెప్పారు. తర్వాత టిఎక్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న మనోజ్‌కుమార్ రిపోర్టును పోలీసులకు సమర్పించారు.

ఎడమవైపు ఉన్న భుజానికి గాయమైనట్లు మెడికల్ రిపోర్ట్‌లో వైద్యులు తెలిపారు. మనోజ్ కుడివైపు భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. జల్‌పల్లి ఫామ్ హౌస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు మంచు మనోజ్‌పై దాడి చేసినట్లు మెడికల్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పొట్ట, వెన్న పూస, మెడకు కనిపించని గాయాలైనట్లు వెల్లడించారు. అయితే 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని మనోజ్‌కు వైద్యులు సూచించగా సోమవారం మరోసారి వస్తానని చెప్పి మనోజ్ డిశ్చార్జి అయినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News