బెంగళూరు: కన్న కూతురు ముందు ప్రియురాలును ప్రియుడు కత్తితో పొడిచి అనంతరం మృతి దేహాన్ని చెరువులో పడేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తృప్తి(26) అనే మహిళతో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. చిరంజీవి(28) అనే వ్యక్తి తృప్తి వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత కొన్ని రోజుల ఇద్దరు మధ్య విబేధాలు రావడంతో చిరంజీవిని పక్కకు పెట్టింది. గత రెండు నెలల నుంచి ఆమెను కలుసుకోవడానికి చిరు ప్రయత్ని చేస్తున్నాడు.
ప్రియుడు చేసిన ఫోన్ కాల్స్‌ను ప్రియురాలు లిఫ్ట్ చేయకపోవడంతో ఆమెపై అతడు ఆగ్రహం రగిలిపోయాడు. దీంతో ప్రియుడు ఆమె ఇంటికెళ్లి ప్రియురాలితో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తితో తీసి ఆమెను పలుమార్లు పొడిచాడు. ఈ సంఘటన తృప్తి కూతురు(3) అక్కడే ఉంది. అనంతరం మృతదేహాన్ని ఇంటిదగ్గరలో ఉన్న చెరువులో పడేశాడు. స్థానికుల సమాచార మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిరంజీవిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మూడు నెలల క్రితం ప్రియుడితో ప్రియురాలు పారిపోయిందని స్థానికులు తెలిపారు.