- Advertisement -
హైదరాబాద్: మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో నటుడు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్, ఆయన భార్య మౌనికపై పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండో రోజుల క్రితం తనపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ రెడ్డి, కిరణ్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన భార్యపై మోహన్ బాబు తప్పుడు ఆరోపణలు చేశారని మంచు మనోజ్ మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు గురించి ప్రస్తావిస్తున్నందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు. తాను ఎప్పుడు ఎవరిపైనా ఆధారపడలేదని, స్వతంత్రగా బతుకుతున్నానని వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు ఆస్తుల గురించి ఎప్పుడు గొడవలు చేయలేదని మంచు మనోజ్ చెప్పారు.
- Advertisement -