Thursday, December 12, 2024

నా భార్యపై ఆ ఆరోపణలు… పరువు తీసి గొంతు నొక్కుతున్నారు: మనోజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు మోహన్‌బాబు ఆరోపణలపై తనయుడు మంచు మనోజ్ స్పందించారు. మోహన్‌బాబు ఆరోపణలకు వివరణ ఇస్తూ ఎక్స్‌లో మంచు మనోజ్ పోస్టు చేశారు. తన తండ్రి ఆరోపణలు చాలా బాధ కలిగించాయని, తన భార్య మౌనికపై దురుద్దేశపూరిత ఆరోపణలు చేశారని, తన తండ్రి చేసిన ఆరోపణలలో అవాస్తవాలు ఉన్నాయని మండిపడ్డారు. తన పరువు తీసి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితామన్నారు. భార్యకు ఉద్దేశాలు ఆపాదించడం దురదృష్టకరమని, మా తండ్రి దుర్బాషాలడడంతో ఇంట్లో పని వారు భయపడుతున్నారని, అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాము స్వయం ఉపాధి పొందుతూ స్వతంత్రంగా ఉన్నామని, తానెప్పుడూ ఆర్థిక సాయం కోసం తన కుటుంబంపై ఆధారపడలేదని, తాను ఏడాది నుంచి మా నాన్న ఇంట్లో ఉంటున్నామని, తన సోదరుడు దుబాయ్ వెళ్లిన తరువాత మా అమ్మ ఒంటరిగా ఉంటుందని, తనని ఇంటికి రమ్మని మా నాన్న పిలిచారని మంచు మనోజ్ పేర్కొన్నారు.

Manchu manoj comments on mohan babu

నాలుగు నెలల క్రితం దురుద్దేశపూర్వకంగా వెళ్లానని ఆరోపణలు చేశారని, తనని, తన భార్యను ఇరికించే ఉద్దేశంతో ఫిర్యాదు చేశారన్నారు. తాను ఆ ఇంట్లో ఉన్నట్లు ధ్రువీకరించాలని అధికారులను కోరుతున్నానన్నారు. తన ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా ధ్రువీకరించాలని అభ్యర్థిస్తున్నానని, ఏడు నెలల కుమార్తెను వివాదంలోకి లాగడం అనేది అమానవీయమని మంచు మనోజ్ బాధను వ్యక్తం చేశారు. తనకు తగిలిన గాయాలకు చికిత్స కోసమే ఆస్పత్రికి వెళ్లానని, ఏం దాచాడానికి యత్నిస్తున్నారో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తానెప్పుడూ వారసత్వపు ఆస్తుల కోసం అడగలేదని, ఆస్తులు అడిగి ఉంటే సాక్ష్యాలు ఇవ్వాలని సవాల్ చేస్తున్నామన్నారు. ఎంబియు విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారని, నటుడు విష్ణు సహచరులు వినయ్, మహేశ్వర్ ద్వారా దోపిడీ జరుగుతోందన్నారు. అర్థిక అక్రమాలు, దోపిడీకి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆధారాలు అధికారులకు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నాయని మంచు మనోజ్ తెలియజేశారు. మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో నటుడు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్, ఆయన భార్య మౌనికపై పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News