హైదరాబాద్: వేలాది ఉద్యమకారులు నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారని ఎంఎల్‌సి కవిత తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం నిరసన దీక్షలో కవిత, బిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. బతుకమ్మ పండుగను విగ్రహంలో ఎందుకు చేర్చలేదని అడిగారు.
తొమ్మిది మంది కళాకారులను సన్మనిస్తామన్నారని, కళాకారుల జాబితాలో మహిళలు ఎక్కడ? అని నిలదీశారు. కళాకారులు విమలక్క, మల్లు స్వారాజ్యం, సంధ్యలాంటి వారు కనిపించడంలేదా? అని విమర్శలు గుప్పించారు. తెలంగాణ పేద ప్రజలు ఎప్పటికీ అలాగే ఉండాలా? అని ధ్వజమెత్తారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైందని, స్ఫూర్తి నింపే తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని, ఉద్యమ కాలం నాటి ప్రతీకలను అవమానించే యత్నమని, సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామన్నారు. ఉద్యమకారులకు సాయం చేయాలే కానీ అవమానించవద్దని హెచ్చరించారు. ఈ కార్య్రమంలో ఎంఎల్‌సి కవిత, బిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.