Thursday, December 12, 2024

ప్రతిపక్షాలు ఆందోళన… ఉభయసభలు రేపటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. అదానీ, సోరోస్ అంశాలపై విపక్షాలు అందోళన చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వరుస నిరసనలు చేయడంతో విపక్ష నేతలతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విపక్ష సభ్యుల తీరుపట్ల రాజ్యసభ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటులో విపక్షాల నిరసనలపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభలో విపక్షాలు హుందాగా ప్రవర్తించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు కొన్ని రోజులుగా నిరసనలు చేయడంపట్ల అసహనం వ్యక్తం చేశారు. పోస్టర్లు, మాస్కులు ధరించి నినాదాలు చేస్తున్నారని, విపక్ష సభ్యుల తీరు సరిగా లేదని, వారు హుందాగా ప్రవర్తించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News