Thursday, December 12, 2024

ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. లాభాల్లో మొదలైన సూచీల్లో తర్వాత స్తబ్ధత నెలకొంది. సెన్సెక్స్ 1.59 పాయింట్లు పెరుగుదల లేక 0.00 శాతంతో 81510.05 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8.96 పాయింట్లు లేక 0.04 శాతం నష్టంతో 24610.05 వద్ద ముగిసింది.నిఫ్టీలో ప్రధానంగా శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, హెచ్ సిఎల్ టెక్, విప్రో, ఇన్ఫీ లాభపడగా, భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డి, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ పైజెస్, హెచ్ డిఎఫ్ సి లైఫ్ నష్టపోయాయి.

10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 125.00 లేక 0.16 శాతం పెరిగి రూ. 76168.00 వద్ద ట్రేడయింది. కాగా డాలరుతో రూపాయి మారకం విలువ 0.11 పాయింట్లు లేక 0.13 శాతం పెరిగి రూ. 84.85 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News