- Advertisement -
జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు తో పాటు ఆయన అనుచరులు చేసిన దాడిపై పోలీసులు కేసు నమోదు చేయాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా జర్నలిస్టులపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ మైకులు లాక్కొని దాడి చేశారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించి మోహన్ బాబును అరెస్ట్ చేసేలా డిజిపిని కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
- Advertisement -