Thursday, December 12, 2024

జైపూర్ పర్యటనకు ముఖ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

అటు నుంచి అటే ఢిల్లీకి 12,13
తేదీల్లో హస్తినలో.. ఎఐసిసి
అగ్రనేతలు, కేంద్రమంత్రులతో భేటీ
అయ్యే అవకాశం మంత్రివర్గ విస్తరణ,
నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం జైపూర్‌కు వెళ్లినట్టుగా తెలిసింది. తన బంధువుల కు సంబంధించిన శుభకార్య ఉండడంతో ఆయ న తన కుటుంబసభ్యులతో కలిసి జైపూర్‌కు బ య లుదేరి వెళ్లినట్టుగా సమాచారం. నేడు సా యం త్రం వరకు జైపూర్‌లో ఉండి అక్కడి నుంచి ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలిసింది. రెండు రోజుల పాటు (12, 13 తేదీ ల్లో) ఆయన ఢిల్లీలో పర్యటించనున్నట్టుగా తెలిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేతలతోనూ, కేంద్రమంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు.

పార్టీ నేతలతో జరిగే సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. కాగా, ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఇత ర ముఖ్యనేతలు కూడా పా ల్గొననున్నట్టుగా స మాచారం.రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తదితర అంశాలను అధిష్ఠానానికి రేవంత్‌రె డ్డి వివరించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గా లు తెలియజేశాయి. కాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీని కూడా అందుబాటులో ఉండాలని అధిష్ఠానం ఆదేశించినట్లు తె లిసింది. అలాగే కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై పలు వినతులను సిఎం అందచేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News