బ్రిస్బేన్: బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఇలాంటి స్థితిలో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లు భారత జట్టుకు చావోరేవోగా మారింది. బుమ్రా సారథ్యంలో మొదటి టెస్టులో బరిలోకి దిగిన టీమిండియా చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ రోహిత్ కెప్టెన్సీలో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. జట్టు ను ముందుండి నడిపించడంలో రోహిత్ పూర్తి గా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేక పోయా డు.
జట్టు ఓటమికి రోహిత్ పేలవమైన కెప్టెన్సీనే కారణమని భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇం గ్లండ్ తదితర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీలో పసలేదని, అతను సారథిగా పనికిరాడని అతన్ని తప్పిస్తేనే జట్టుకు మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రోహిత్ కెప్టెన్‌గా ఘోరంగా విఫలమైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
అతని సా రథ్యంలో భారత్ ఎప్పుడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైందని ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లు రోహిత్‌కు సవాల్‌గా మారాయి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా జ ట్టుకు అండగా నిలువాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది. భవిష్యత్తులో సారథ్యాన్ని నిలబెట్టుకోవాలంటే బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌లో భారత్‌ను విజేతగా నిలుపడం తప్పించి రోహిత్‌కు మరో మార్గం కనిపించడం లేదు. రెండో టెస్టు లో రోహిత్ బ్యాటర్‌గా పూర్తిగా తేలిపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోరు కే పెవిలియన్ చేరాడు.
ఈ పరిస్థితుల్లో రానున్న మ్యాచ్‌లు రోహిత్ బ్యాటింగ్‌కు పరీక్షగా మారనున్నాయి. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇందులో అతను ఎంత వరకు సఫలం అవుతాడనే దానిపైనే టీమిండియా గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో రానున్న టెస్టుల్లో అందరి దృష్టి రోహిత్‌పైనే నిలవడం ఖాయం. ఇక తీవ్ర ఒత్తిడిలో ఉన్న రోహిత్ జట్టును ఎలా నడిపిస్తాడో వేచి చూడాల్సిందే.