Thursday, December 12, 2024

మోహన్ బాబుపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడంతో వారు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మోహన్ బాబుపై బిఎన్‌ఎస్ 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గత రెండు రోజుల నుంచి మంచు కుటుంబంలో మోహన్ బాబు, తనయుడు మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. జల్‌పల్లిలోని పెద్దమనుషుల సమక్షంలో చర్చలు జరపడానికి మంచు మనోజ్ తన తండ్రి మోహన్‌బాబు ఇంటికి వెళ్లాడు. చర్చలు విఫలం కావడంతో మంచు మనోజ్, మంచు విష్ణు బౌన్సర్ల మధ్య గొడవలు జరిగాయి. మోహన్ బాబు ఇంటి వద్ద ఉన్న మీడియా ప్రతినిధులను బౌన్సర్లు బయటకు నెట్టేశారు. మోహన్ బాబు మైకు లాక్కొని మీడియా ప్రతినిధి ముఖంపై కొట్టారు. బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో ఓ ఛానల్ కెమెరామెన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మీడియాలో ప్రతినిధులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో పోలీసులు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News