Sunday, January 12, 2025

మంచిర్యాలలో అప్పులు బరించలేక కుటుంబం ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: అప్పుల బాధలు బరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాసిపేటలో మొండయ్య అనే వ్యక్తి(55), తన భార్య శ్రీదేవి(50), కూతురు చైతన్య, కుమారుడు శివ ప్రసాద్‌తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మొండయ్య గత కొన్ని సంవత్సరాలుగా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడంతో ఆర్థికంగా నష్టపోయారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా కావడంతో అప్పులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. మంగళవారం ఉదయం కూల్‌డ్రింక్‌లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో నుంచి అరుపులు వినపడడంతో గ్రామస్థులు గమనించి వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికత్స పొందుతూ దంపతులు, కుమార్తె చనిపోయారు. శివ ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News