Thursday, December 12, 2024

సివిల్స్ మెయిన్స్‌లో మనోళ్ల సత్తా

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికసాయం అందుకున్న 20మంది
అభ్యర్థులు ఇంటర్వూలకు ఎంపిక ఆగస్టులో
135మందికి రూ. లక్ష చొప్పున చెక్కులు అందజేసిన
సిఎం మెయిన్స్ విజేతలకు రేవంత్‌రెడ్డి అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్: యూపిఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి యూపిఎ స్సీ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విడుదలైన యూపిఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ ఫలితాలు విడుదల కాగా, అందులో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద ఆర్థికసాయం పొందిన 20 మంది అభ్యర్థులు ఎంపిక కావడంపై సిఎం అభినందనలు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సివిల్స్ సాధించే లక్ష్యం తో దానికోసం కష్టపడే పేద కుటుంబాలకు అం డగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్ర ప్రభు త్వం అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి రూ. లక్ష చొప్పున ప్రభు త్వం ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది ఆగష్టు 26వ తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వారికి చెక్కులను పంపిణీ చేశారు. రాజీవ్ సివి ల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థు ల్లో 20 మంది తాజాగా యూపిఎస్సీ మెయిన్స్ ఫలితాల్లోనూ విజేతలుగా నిలిచారు. వరంగల్ అర్భన్ జిల్లాకు చెందిన ఈ.

సాయి శివాని, రా హుల్ శంకేషి, పోతరాజు హరి ప్రసాద్, విక్రమ్ బేతి, ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల సాయికుమార్, బానోతు నాగ రాజా నాయక్, మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లాకు చెందిన కడారి శ్రీవాణి, గాదె శ్వేత, రాపర్తి ప్రీతి, మెదక్ జిల్లాకు చెందిన కు మ్మరి శ్రవణ్ కుమార్, రంగారెడ్డి జిల్లాకు చెంది న మహ్మద్ అశ్ఫాక్, తొగరు సూర్యతేజ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బెస్త ప్రియాంజలి, సిద్ధిపేటకు చెందిన నరిగె స్వామి, నాగర్‌కర్నూల్‌కు చెందిన గోకమల్ల అంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన ఆర్. ప్రమోద్‌కుమార్, వికారాబాద్‌కు చెందిన బి. ప్రహ్లాద్, జగిత్యాలకు చెం దిన బురుగుపెల్లి నీరజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన జస్వంత్ కుమార్, ఆసిఫాబాద్ -కుమురం భీం జిల్లాకు చెందిన రామ్టెంకి సుధాకర్ మెయిన్స్ క్వాలిఫై అయిన జాబితాలో ఉన్నారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తదుపరి దశల్లోనూ అభ్యర్థులు రా ణించాలని ఈ సందర్భంగా సిఎం ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News