జర్నలిస్టుపై దాడి ఘటనలో
పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో
ఫిర్యాదు నటుడిపై చర్యలు
తీసుకోవాలని పాత్రికేయుల
ఆందోళన రాచకొండ పోలీసుల
నోటీసులపై హైకోర్టు స్టే సిపి
ఎదుట మంచు మనోజ్,విష్ణు
హాజరు శాంతిభద్రతలకు
విఘాతం కలిగించొద్దని పోలీస్
కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశం
జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్‌బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసనకు దిగిన పాత్రికేయులు. చిత్రంలో మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్
మన తెలంగాణ/హైదరాబాద్: మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నటుడు మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బిఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం నిరూపితం అయితే ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జల్‌పల్లి లో మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన ను పోలీస్ శాఖ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు తాజాగా, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలం టూ రాచకొండ పోలీస్ కమిష నర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు.