మేషం – వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవి ఉండవు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.
వృషభం – మొండికి పడిన పనులను సాధించుకోగలుగుతారు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్తలు అవసరం.
మిథునం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గతంలో వద్దనుకున్న అవకాశాలు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు. మానసిక సంఘర్షణ మాత్రం తీరదు.
కర్కాటకం – మీ ప్రణాళికలు వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి. ప్రధానమైన కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసిన ధనమును వ్యయ ప్రయాలకోర్చి సమకూర్చుకోగలుగుతారు.
సింహం – తలపెట్టిన పనులలో స్వయంకృతాపరాదాలు చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య – వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు లభిస్తాయి. దైనందిన కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులను చేసే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు.
తుల – అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను సానుకూలపరుచుకోగలుగుతారు. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగిస్తారు.అయితే ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవు.
వృశ్చికం – మీరు స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు. పనివారు సహ ఉద్యోగులు కొన్ని చికాకులు కల్పించిన వాటిని అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి.
ధనుస్సు – కొన్ని చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలపరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
మకరం – అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత ఉద్యోగ అవకాశాల పైన దృష్టి సారిస్తారు.
కుంభం – కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా ప్రాకు లాడుతారు. చాలామంది జీవితాలు మీ ఆలోచన విధానాల మీద మీ ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి కనుక ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి.
మీనం – నలుగురికి సహాయపడాలనుకునే మీ మనస్తత్వానికి భగవంతుడు తగిన విధంగా మంచి అవకాశాలను అందిస్తాడు. ముఖ్యమైన విషయాలు విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225