- Advertisement -
ఓ వ్యక్తి ఇంట్లోనే సజీవ దహనమయ్యాడు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మల్యాల మండలంలోని మ్యాడంపల్లి గ్రామంలో గాతం తిరుపతి(40) ఇంట్లో ప్రమాదశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు ఇల్లు మొత్తం వ్యాపించడంతో మిద్దె కుప్పకూలింది. మండుతున్న కట్టెలు మీద పడి తిరుపతి సజీవదహనమైనట్లు తెలుస్తోంది. దీంతో మృతుడి కుటుంబం, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -