Thursday, December 12, 2024

నాగార్జున పరువు నష్టం దావాపై విచారణ వాయిదా..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువునష్టం దావాపై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మంత్రి కొండా సురేక కోర్టు ముందు హాజరు కావాలంటూ గత విచారణలో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మంత్రి కొండా సురేఖ తరఫున న్యాయవాది నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి హాజరు కోసం మరో తేదీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

ఈ కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కాగా, మంత్రి కొండ సురేఖ.. కెటిఆర్ విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కినేని కుటుంబ, మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News