Thursday, December 19, 2024

వంటనూనెల ఉత్పత్తిలో గోల్డ్‌డ్రాప్‌ కు జాతీయ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: వంటనూనెల పరిశ్రమలో ప్రముఖ సంస్ధ గోల్డ్‌డ్రాప్‌, మరో మారు ప్రతిష్టాత్మకమైన కౌన్సిల్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌(సీఐటీడీ) అవార్డును అందుకుంది. నాణ్యత, భద్రత పట్ల సర్వోన్నత ప్రమాణాలను అందుకున్నందుకు గోల్డ్‌డ్రాప్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డును గోల్డ్‌డ్రాప్‌ గెలుచుకోవడం ఏడవసారి. అత్యున్నత నాణ్యత, పరిశుభ్రత, పోషకాల పరంగా అత్యున్నత వంట నూనెగా గోల్డ్‌డ్రాప్‌ నిబద్ధతను ఈ అవార్డు గుర్తిస్తుంది.

తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ శ్రీ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదగా గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మితేష్‌ లోహియా మాట్లాడుతూ.. “మరోమారు ఈ అవార్డు అందుకోవడం నాణ్యత, ఆవిష్కరణ పట్ల మా అవిశ్రాంత ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తుంది.మా వినియోగదారులకు అత్యుత్తమమైనది అందించేందుకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను అనుసరిస్తున్నాము. ‘ చాలాచాలా లైట్‌ ఆల్వేస్‌ యాక్టివ్‌’ అనే వాగ్ధానాన్ని గోల్డ్‌ డ్రాప్‌ నేరవేరుస్తూ స్వచ్ఛత, రుచి, పోషకాలను అందిస్తుంది’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News