- Advertisement -
ముంబై: ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ గురువారం రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. మరోవైపు అమెరికా డాలరుకు డిమాండ్ పెరిగింది. డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 84.88 కు చేరింది. యుఎస్ బాండ్స్ ఈల్డ్స్ కూడా గురువారం పుంజుకున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు ఎప్పటిలానే గురువారం కూడా స్పాట్ మార్కెట్ లో డాలర్లను అమ్మేసింది. న్యూ ఆల్ టైమ్ లోస్ నుంచి రూపాయి విలువను కాపాడడానికి మద్దతు ఇచ్చింది. కాగా ఇండియా రిటైల్ ఇన్ ఫ్లేషన్ డేటా కోసం మదుపరులు ఎదురుచూస్తున్నారు.
- Advertisement -