- Advertisement -
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. నేడు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేక పోతున్నట్లు సదరు మంత్రి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరో తేదీ కేటాయించాలని కోరగా…తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
- Advertisement -