Monday, January 13, 2025

క్రయోజనిక్ ఇంజిన్‌ను పరీక్షించిన ఇస్రో

- Advertisement -
- Advertisement -

దేశీయంగా తయారు చేసిన సి 20 క్రయోజనిక్ ఇంజిన్‌కు కీలకమైన పరీక్ష నిర్వహించడంలో ఇస్రో విజయవంతమైంది.ఈ విజయం భవిష్యత్ మిషన్లకు ముందడుగు అని ఇస్రోవెల్లడించింది. తమిళనాడు మహేంద్రగిరి లోని ఇస్రో ప్రొపల్సన్ కాంప్లెక్సులో ఈ పరీక్ష నవంబర్ 29న నిర్వహించారు. సముద్ర ఉపరితలం మీదుగా హాట్ టెస్ట్ జరిగిందని ఇస్రో పేర్కొంది. లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్స్ సెంటర్ ఈ క్రయోజనిక్ ఇంజిన్‌ను రూపొందించింది. లాంచ్ వెహికల్ మార్క్ 3 ఉన్నత దశకు ఇది చోదక శక్తిని అందిస్తుంది. 19 టన్నుల బరువు సామర్ధం స్థాయివరకు ఇది ఆపరేట్ చేయగలదని ఇస్రో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News