సింగపూర్: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్లో విజేతగా నిలిచి రికార్డు సృస్టించిన భారత చెస్ ఆటగాడు గుకేశ్ దొమ్మరాజుపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, ఎస్ ఎస్ రాజమౌళి, మోహన్ లాలా, మమ్ముట్టి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, ధనుష్ లతోపాటు పలువురు హీరోలు గుకేశ్ ను అభినందిస్తూ పోస్ట్ పెడుతున్నారు.
కాగా, సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ చరిత్ర సృష్టించాడు.18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ ఛాంపియన్‌గా అవరించాడు. దీంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచిన పిన్న వయస్కుడిగాను గుకేశ్ నయా రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు విశ్వనాథన్ ఆనంద్ ఈ టైటిల్ కైవసం చేసుకున్నాడు.